Sedans – Hyundai Verna | రోజురోజుకు కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. 2024 జనవరిలో సందడి సందడిగా సాగిన కార్ల విక్రయాల్లో సెడాన్ సెగ్మెంట్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. 2023 జనవరితో పోలిస్తే 48 శాతం పుంజుకున్నది. గతేడాది డిసెంబర్ నెలలో 14,012 యూనిట్లు అమ్ముడు కాగా, జనవరిలో 16,773 కార్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ సేల్స్‌తో పోలిస్తే 20 శాతం గ్రోత్ నమోదైంది. రెండో స్థానంలో హ్యుండాయ్ ఔరా నిలిచింది. ఏడాది క్రితంతో పోలిస్తే 19 శాతం గ్రోత్ నమోదైంది. 2023 డిసెంబర్ నెలలో 3,812 యూనిట్లు అమ్ముడైతే.. గత నెలలో మాత్రం 5,516 కార్లు అమ్ముడు పోయాయి.గతేడాదితో పోలిస్తే హోండా అమేజ్ సేల్స్ 47 శాతం తగ్గుదల నమోదైంది. 2023లో 5,580 యూనిట్లు అమ్ముడైతే, గత నెలలో 2,972 కార్లకే పరిమితమైంది. అయినా సెడాన్ కార్ల విక్రయాల్లో మూడో స్థానం.
ఇక నాలుగో స్థానంలో హ్యుండాయ్ వెర్నా నిలిచింది. 2023తో పోలిస్తే 118 శాతం గ్రోత్ నమోదైంది. గత నెలలో 2,172 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుండాయ్ వెర్నా తర్వాత స్థానంలో ఫోక్స్ వ్యాగన్ విర్టస్ నిలిచింది. టాప్ సెల్లింగ్ మోడల్స్ జాబితాలో ఉన్న హోండా సిటీని హ్యుండాయ్ వెర్నా పక్కకు నెట్టేసింది.టాప్-5 సెడాన్స్ కార్లలో చోటు దక్కించుకున్న ఫోక్స్ వ్యాగన్ విర్టస్ గత నెలలో 1,879 యూనిట్లు విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 17 శాతం గ్రోత్ రికార్డయింది. ఫోక్స్ వ్యాగన్ విర్టస్ మోడల్ కార్లలో ఫీచర్లు, డిజైన్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.టాటా టైగోర్ 50 శాతం పెరిగి 1,539 కార్లు విక్రయిస్తే, స్కోడా స్లావియా 1242 యూనిట్లు అమ్ముడయ్యాయి.