Market Capitalisation | గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్ -10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,21,270.83 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ బెంచ్ మార్క్ 1,027.54 (1.21 శాతం) పాయింట్లు పెరిగింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 85,978.25 పాయింట్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.53,652.92 కోట్లు వృద్ధి చెంది రూ.20, Rs 20,65,197.60 కోట్లకు చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 18,518.57 కోట్లు పుంజుకుని రూ.7,16,333.98 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.13,094.52 కోట్లు వృద్ధితో రూ.9,87,904.63 కోట్లకు చేరుకుంది. ఐటీసీ ఎం-క్యాప్ రూ. 9,927.3 కోట్లు పెరిగి రూ.6,53,834.72 కోట్ల వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,592.96 పుంజుకుని రూ.15,59,052 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,581.64 కోట్లు పెరిగి రూ.13,37,186.93 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.8,443.87 కోట్లు వృద్ధి చెంది రూ.6,47,616.51 కోట్లకు దూసుకెళ్లింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.459.05 కోట్ల వృద్ధితో రూ.7,91,897.44 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,706.16 కోట్లు పతనమై రూ.9,20,520.72 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీ లివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,195.44 కోట్లు తగ్గి రూ.6,96,888.77 కోట్లకు చేరుకుంది. గత వారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత అత్యంత విలువ గల సంస్థగా రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, ఎల్ఐసీ నిలిచాయి.