Gold Rates | హైదరాబాద్, సెప్టెంబర్ 14: బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ తులం ధర రూ.440 అధికమై రూ.74,890కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.74,450గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ ధర రూ.400 ఎగబాకి రూ.68,250 నుంచి రూ.68,650కి చేరుకున్నది. వెండి లక్ష రూపాయల దిశగా పయనిస్తున్నది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.2,000 అధికమై రూ.97 వేలకు చేరుకున్నది. గడిచిన నాలుగు రోజుల్లో బంగారం రూ.2,500 వరకు, వెండి రూ.8 వేల వరకు పెరిగింది.