నిరాశాజనక ఫలితాలే..
యూఎస్, యూరప్‌ల్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ మందకొడిగా ఉన్నందున, దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో మెరుపులేవీ ఉండవని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పైగా పశ్చిమ దేశాల్లో డిసెంబర్ నెలలో అధికశాతం ఉద్యోగులు సెలవుల్లో వెళతారు.
- నేడు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ3 రిజల్ట్స్
న్యూఢిల్లీ, జనవరి 10: యూఎస్, యూరప్‌ల్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ మందకొడిగా ఉన్నందున, దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో మెరుపులేవీ ఉండవని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పైగా పశ్చిమ దేశాల్లో డిసెంబర్ నెలలో అధికశాతం ఉద్యోగులు సెలవుల్లో వెళతారు. దీంతో సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 బలహీనమైన త్రైమాసికంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దిగ్గజ కంపెనీల ఆదాయ, లాభాల్లో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంటుందని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికానికి టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు గురువారం జనవరి 11న ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో 9 బ్రోకరేజ్ సంస్థల సగటు అంచనాలు ఇలా ఉన్నాయి..
టీసీఎస్
- సెప్టెంబర్ త్రైమాసికంతో (క్యూ2)తో పోలిస్తే క్యూ3లో ఆదాయం 0.7 శాతం పెరుగుదలతో రూ.60,119 కోట్లకు చేరుతుంది.
- లాభం కేవలం 1 శాతం వృద్ధితో రూ.11,446 కోట్లను అందుకోవచ్చు.
- గత ఏడాది క్యూ3 కంటే ఆదాయం 3.3 శాతం, లాభం 5.5 శాతం చొప్పున పెరుగుతుంది.
- బీఎన్పీ పారిబా, నోమురాలు మాత్రం ఆదాయ, లాభాలు క్షీణిస్తాయని అంచనా వేశాయి.
- టీసీఎస్ పొందిన డీల్స్ తక్కువగానే ఉంటాయని అంచనా. 8.5-9 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు సంపాదించి ఉంటుందని కొటక్ ఈక్విటీస్ అంచనా వేసింది.
- రూపాయి విలువ తగ్గుదలతో పాటు వ్యయాల్ని అదుపుచేసుకున్నందున, లాభాల మార్జిన్లు ఫ్లాట్‌గా లేదా స్వల్పంగా పెరగవచ్చు.
- ఇబిట్ మార్జిన్ 23.1-26.7 రేంజ్లో ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఇది క్యూ2లో 24.3 శాతంకాగా, నిరుడు క్యూ3లో 24.5 శాతం ఉన్నది.
ఇన్ఫోసిస్
- సాధారణంగా డిసెంబర్ త్రైమాసికం ఐటీ కంపెనీలు నిరుత్సాహకర పనితీరునే ప్రదర్శిస్తుంటాయి. అయితే అన్నింటికంటే ఇన్ఫోసిస్ ఫలితాలు అధమంగా ఉంటాయని అంచనా.
- ఆదాయ, లాభాలు, మార్జిన్లు క్షీణిస్తాయని మెజారిటీ బ్రోకరేజ్‌లు అంటున్నాయి.
- త్రైమాసిక వారీగా ఆదాయం 1.4-1.7 శాతం తగ్గుతుందని, నిరుడు క్యూ3తో పోలిస్తే 8 శాతం క్షీణిస్తుందని అంచనా.
- బ్రోకరేజ్‌ల సగటు అంచనాల ప్రకారం ఆదాయం రూ.38,641 కోట్లకు, నికరలాభం 2.2 శాతం తగ్గుదలతో రూ. 6,078 కోట్లుగా నమోదుకావచ్చు.
- వేతన పెంపుదల కారణంగా టీసీఎస్కంటే ఇన్ఫీ లాభాల మార్జిన్లు తగ్గవచ్చు.
- ఈబీటా మార్జిన్ 21.2 శాతం నుంచి 20-20.5 శాతానికి క్షీణిస్తుంది.
- గత త్రైమాసికంలో 1.5 బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్టు రద్దు అయిన నేపథ్యంలో ఐటీ డిమాండ్‌పై ఇన్ఫోసిస్ జాగ్రత్తగా స్పందిస్తుందని అంచనా. యూఎస్, యూరప్, యూకేల్లో డిమాండ్ పరిస్థితులపై ఇన్ఫోసిస్ వెల్లడించే కామెంటరీపై మార్కెట్ ఆతృతగా ఎదురు చూస్తున్నది.
- క్యూ3లో బలహీన ఫలితాల్ని ప్రకటించినా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గైడెన్స్‌లో కోత విధించదని అంచనా. 2023-24లో ఆదాయం 1-2.5 శాతం రేంజ్లో వృద్ధిచెందవచ్చని, ఆపరేటింగ్ మార్జిన్లు 20-22 శాతం రేంజ్లో ఉంటాయని సెప్టెంబర్‌లో ఇన్ఫీ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- infosys
- IT services
- tata
- tcs
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

