గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. 8న నిరవధిక సమ్మెకు బీఆర్టీయూ మద్దతు
సమ్మెకు ముందే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల సమస్యలను పరిషరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డి మాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్టీయూ గిగ్, ప్లాట్ ఫామ్ వరర్స్ విభాగం ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- భవిష్యత్తులో గిగ్ వరర్లకు అన్ని విధాలా బీఆర్ఎస్ అండగా ఉంటది : కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : సమ్మెకు ముందే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల సమస్యలను పరిషరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డి మాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్టీయూ గిగ్, ప్లాట్ ఫామ్ వరర్స్ విభాగం ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్(టీఏడీఎఫ్) ఆధ్వర్యం లో ఈ నెల 8 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు బీఆర్టీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ‘ఇది కేవలం ఆదాయం కోసం మాత్రమే కాదు. లక్షలాది గిగ్ కార్మికుల గౌరవం, జీవనోపాధి, సామాజిక భ ద్రత కోసం జరుగుతున్న ఉద్యమం.
ప్రభుత్వం న్యా యం చేస్తే సమ్మె చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మె తప్పదు’ అని బీఆర్టీయూ నాయకులు హెచ్చరించారు. ‘అన్ని యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, డెలివరీ సేవలకు కనీ స ప్రాథమిక చార్జీలతోపాటు, కిలోమీటరుకు, నిమిషానికి ప్రభుత్వం అధికారికంగా రేట్లను నిర్ణయించా లి. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం ప్ర త్యేకంగా రూల్స్ రూపొందించి, సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలి. ప్లాట్ ఫామ్ కంపెనీలు ఏకపక్షంగా చార్జీలు నిర్ణయించే విధానానికి స్వస్తి ప లుకాలి. మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకా లు-2025 ప్రకారం ప్రభుత్వం కనీస చార్జీలను నో టిఫై చేయాలి’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, గిగ్, ప్లాట్ ఫామ్ వరర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అత్తినమోని నాగేశ్కుమార్, టీఏడీఎఫ్ నాయకులు రాజుయాదవ్, ప్రసాద్, సోమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

