హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : చిన్నారి చికిత్స కోసం సాయం చేసి అండగా నిలిచిన కేటీఆర్‌కు తెలంగాణ అమరుడు యాదిరెడ్డి సోదరుడి కుమార్తె భవిష్య కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. కోలుకున్న చిన్నారితో ఆమె కుటుంబసభ్యులు కేటీఆర్‌ను సోమవారం నందినగర్‌లోని నివాసంలో కలిశారు. అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యతో కేటీఆర్ ముచ్చటించారు. త్వరగా సం పూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని, దీర్ఘాయుష్షుతో ఉన్నతస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
గత నెల మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో తెలంగాణ అమరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించిన విష యం తెలిసిందే. ఈ సందర్భంగా యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య ఆరోగ్య సమస్య గు రించి కేటీఆర్ తెలుసుకున్నారు. చిన్నారికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారని తెలిసిన వెంటనే ఆందోళన చెందవద్దని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. పార్టీ తరఫున మెరుగైన చికిత్స అందేలా ఆదేశించారు.