ముంబై, అక్టోబర్ 10: బ్రిటన్‌కు చెందిన టైడ్..భారత్‌లో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో 500 మిలియన్ పౌండ్లు(రూ.6 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్న సంస్థ..వచ్చే ఏడాదికాలంలో కొత్తగా 800 నూతన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు టైడ్ సీఈవో ఒలివర్ ప్రిల్ తెలిపారు. 2021లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థ..అప్పట్లోనే 100 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, గురుగ్రామ్‌లలో ఉన్న కార్యాలయాల్లో 1,500 మంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాదిలో మరో 800 మందిని రిక్రూట్ చేసుకోనున్నది.
ఎస్బీఐ కార్డ్ పండుగ ఆఫర్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ కార్డ్ తమ వినియోగదారులకు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ-కామర్స్, జ్యుయెల్లరీ, ఫ్యాషన్, ఫర్నీచర్, కిరాణ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు తదితర కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్, ఇన్స్టంట్ డిస్కౌంట్లను ఇస్తున్నది. రూ.20 వేలదాకా వోచర్లు, అంతర్జాతీయ లాంజ్ ఫ్రీ యాక్సెస్, ఇతరత్రా ప్రయో జనాలు కార్డుదారులకు వర్తిసాయి.