Top Ten YouTube Channels : 2005లో లాంఛ్ అయి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో గేమ్‌ఛేంజర్‌గా మారిన యూట్యూబ్ లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది.
ఇక సబ్స్క్రైబర్ల పరంగా ఏ ఛానెల్ సత్తా ఎంత అనే వివరాలు వీక్షకుల్లో ఎప్పటికీ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ఛానెల్ అనగానే ఏ అమెరికన్, యూరోపియన్ ఛానెల్ గురించిన ఆలోచన మెదులుతుంటుంది.
అయితే టాప్ స్పాట్లో భారత్‌కు చెందిన టీ సిరీస్ నిలిచిందని ఫోర్బ్స్ ఇండియా గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచంలో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన టాప్ టెన్ యూట్యూబ్ ఛానెల్స్‌లో దేశీ మ్యూజిక్ దిగ్గజం టి సిరీస్ నిలిచింది. టాప్ టెన్ యూట్యూబ్ ఛానెల్స్‌లో మూడు భారతీయ యూట్యూబ్ ఛానెల్స్ చోటు దక్కించుకున్నాయి.
టి సిరీస్ 25.7 కోట్ల సబ్స్క్రైబర్లు
మిస్టర్ బీస్ట్ 23.2 కోట్లు
కోకోమెలన్ 17 కోట్లు
సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ 16.7 కోట్లు
కిడ్స్ డయానా షో 11.8 కోట్లు
ప్యూడైపీ 11.1 కోట్లు
లైక్ నాస్త్యా 11 కోట్లు
వ్లాద్ అండ్ నికీ 10.8 కోట్ల
జీ మ్యూజిక్ కంపెనీ 10.4 కోట్ల
డబ్ల్యూడబ్ల్యూఈ 9.9 కోట్ల సబ్స్క్రైబర్లు
Read More :
Khushnav Khirwar | ఓలా సీఈవో మనసు దోచిన నాలుగేళ్ల బాలుడు.. Videos