Khushnav Khirwar | ఓలా సీఈవో మనసు దోచిన నాలుగేళ్ల బాలుడు.. Videos
Khushnav Khirwar | ఓ నాలుగేళ్ల బాలుడు తన హావభావాలు, డ్యాన్స్‌తో.. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో అయిన భవీశ్ అగర్వాల్ మనసు దోచాడు. ఖుష్నవ్ ఖిన్వర్ అనే నాలుగేళ్ల బాలుడు ‘ఓలా ఎలక్ట్రిక్’, ‘ఓలా డ్యాన్స్’ ఇలా ఓలా అనే పదం తప్పకుండా వచ్చేలా కొన్ని పదాలను ఉచ్చరిస్తూ ముద్దుముద్దుగా డ్యాన్స్‌లు వేస్తున్నాడు. ఆ డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.
Khushnav Khirwar: ఓ నాలుగేళ్ల బాలుడు తన హావభావాలు, డ్యాన్స్‌తో.. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో అయిన భవీశ్ అగర్వాల్ మనసు దోచాడు. ఖుష్నవ్ ఖిన్వర్ అనే నాలుగేళ్ల బాలుడు ‘ఓలా ఎలక్ట్రిక్’, ‘ఓలా డ్యాన్స్’ ఇలా ఓలా అనే పదం తప్పకుండా వచ్చేలా కొన్ని పదాలను ఉచ్చరిస్తూ ముద్దుముద్దుగా డ్యాన్స్‌లు వేస్తున్నాడు. ఆ డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో తాజాగా అలాంటిదే ఓ వీడియోను ఎక్స్ (X) లో షేర్ చేస్తూ.. దానికి ఇచ్చిన క్యాప్షన్‌లో ఓలా సీఈవో అగర్వాల్‌కు ఒక అభ్యర్థన చేశాడు. ఓలా కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించే అవకాశం తనకు కల్పించాలని కోరాడు. ‘భవీశ్ అంకుల్.. నేను ఆగ్రా నుంచి రాక్‌స్టార్ ఖుష్నవ్ను. దయచేసి నాకు ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని సందర్శించే అవకాశం కల్పించండి’ అంటూ హిందీలో క్యాప్షన్ ఇచ్చాడు.
ఖుష్నవ్ అభ్యర్థనకు భవీశ్ అగర్వాల్ ముగ్ధుడయ్యారు. బాలుడి పోస్టుపై సానుకూలంగా స్పందించారు. ‘నీవు వేస్తున్న స్టెప్పులు నాకు బాగా నచ్చాయి. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ మీద, ఓలా కంపెనీ మీద నువ్వు చూపిస్తున్న ఉత్సుకత నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది’ అని రిప్లై ఇచ్చారు. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శనకు తల్లిదండ్రులతో కలిసి రావాలని ఆహ్వానించారు. ‘ఖుష్నవ్.. వచ్చేసెయ్. ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శనకు ప్లాన్ చేసుకో. మీ పేరెంట్స్‌ను కూడా తీసుకురా. ఆనందభరిత క్షణాలను వాళ్లు మిస్ కావద్దు’ అని భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు.
కాగా తమిళనాడులోని కృష్ణగిరిలో దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ‘ఓలా ఎలక్ట్రిక్’ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించనుంది. ఈ కంపెనీని పూర్తిగా మహిళలే నడుపుతారని ఇప్పటికే ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ప్రకటించారు. ప్రపంచంలో అందరూ మహిళలే పనిచేస్తున్న అతిపెద్ద కంపెనీగా ఈ ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Bhavish Uncle , i am Rockstar Khushnav from Agra. Apni Ola ki future factory ki visit kara dijiye please 🙏. Thanks in advance.@OlaElectric @bhash #EndICEage pic.twitter.com/PPqxBEyFPc
— Khushnav Khirwar (@khushnavkk) January 15, 2024
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

