న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.5 వేలు లేదా 3.3 శాతం ఎగబాకి రూ.1,57,700కి చేరుకున్నది. సోమవారం ఇది రూ.1,52,700గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధరలు పెరిగాయి. కిలో వెండి రూ.24 వేలు ఎగబాకి రూ.2.84 లక్షలకు చేరుకున్నది.
అలాగే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.3 వేలు పెరిగి రూ.1,57,500 పలికింది. 22 క్యారెట్ ధర రూ.1,39,100గా నమోదైంది. కిలో వెండి రూ.16 వేలు ఎగబాకి రూ.2.75 లక్షలకు చేరుకున్నది.