Kia Sonet | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియా గత జనవరిలో తన కంపాక్ట్ ఎస్యూవీ సోనెట్ (Sonet) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే, 2024 జనవరి – నవంబర్ మధ్య.. అంటే ఆవిష్కరించిన 11 నెలల్లోనే 1,03,353 యూనిట్లు విక్రయించింది. మూడు ఇంజిన్ ఆప్షన్లలో కియా సోనెట్ అందుబాటులో ఉంది. స్మార్ట్ స్ట్రీమ్ జీ1.2 లీటర్ల పెట్రోల్ (83 పీఎస్/115ఎన్ఎం), స్మార్ట్ స్ట్రీమ్ 1.0 లీటర్ల టీ-జీడీఐ పెట్రోల్ (120 పీఎస్/172 ఎన్ఎం), 1.5 లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ (116 పీఎస్/250 ఎన్ఎం) ఇంజన్ల ఆప్షన్లలో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ విత్ 1.2 పెట్రోల్, 6-స్పీడ్ ఐఎంటీ అండ్ 7-స్పీడ్ డీసీటీ విత్ 1.0 టర్బో పెట్రోల్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ ఏటీ విత్ 1.5 డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. మొత్తం కియా సోనెట్ కార్ల విక్రయాల్లో 76 శాతం పెట్రోల్ పవర్ ట్రైన్స్, 24 శాతం డీజిల్ పవర్ ట్రైన్స్ అమ్ముడవుతున్నాయి. వాటిల్లో 34 శాతం ఐఎంటీ ఆప్షన్ ఇంజిన్ కార్లు ఉన్నాయి.
కియా సోనెట్ 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ నేవిగేషన్, సరౌండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, లెవెల్-1 అడాస్ విత్ 10 ఫీచర్స్ జత చేశారు. కియా సోనెట్ కారు ధర రూ.7.99 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) రూ.15.77 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలాక్ కార్లకు కియా సోనెట్ పోటీనిస్తుంది.