Best Smart Phones | ఈ నెలలో మార్కెట్లోకి వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 టు వన్ ప్లస్ నార్డ్3 వరకూ.. !
Best Smart Phones | స్మార్ట్ ఫోన్ల ప్రియలు ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు ఈ నెలలో మార్కెట్లోకి ఆరు స్మార్ట్ ఫోన్లు తేనున్నాయి. రూ.21,999 నుంచి రూ.56,999 మధ్య ధర పలుకుతాయి.
Best Smart Phones | ఇప్పుడు ప్రతి ఒక్కరి హస్త భూషణం స్మార్ట్ ఫోన్.. చిన్న పిల్లలు మొదలు పెద్దాళ్ల వరకు అప్ డేటెడ్ స్మార్ట్ ఫోన్ చూశాకే దిన చర్య ప్రారంభించరు. నిత్యం మార్కెట్లోకి మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి తెస్తున్నాయి. తాజాగా ఈ నెలలో రియల్ మీ, శాంసంగ్ వంటి సంస్థలు ఆకర్షణీయమైన ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. రియల్ మీ 11 పరో సిరీస్ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ, వన్ ప్లస్ 11 మార్బుల్ ఒడిస్సీ, వన్ ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 ప్రో, ఒప్పో ఎఫ్23 ప్రో మోడల్ ఫోన్లు ఉన్నాయి. వాటిల్లో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
8న రియల్ మీ 11 ప్రో సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ.. దేశీయ మార్కెట్లోకి రెండు రియల్ మీ 11 ప్రో సిరీస్ 5జీ ఫోన్లు తేనున్నది. రియల్ మీ 11 ప్రో 5జీ, రియల్ మీ ప్రో+ ఫోన్లుగా మార్కెట్లోకి ఈ నెల 8వ తేదీన ఎంటర్ కానున్నాయి. 200-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో రియల్ మీ 11 ప్రో సిరీస్ ఫోన్లు వస్తున్నాయి.
మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + కర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 100 వాట్ల సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.21,999గా నిర్ణయించింది.
6న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 లాంచింగ్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి ఈ నెల ఆరో తేదీన తన గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ రానున్నది. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ ప్లస్ ఇనిఫిటీ ఓ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ కూడా వస్తుంది. ఈ ఫోన్ 108-మెగా పిక్సెల్ + 8-మెగా పిక్సెల్ + 2 -మెగా పిక్సెల్స్ కెమెరాలు కలిగి ఉంటుంది. సెల్పీల కోసం 32-మెగా పిక్సెల్స్ కెమెరా కూడా లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.27,999 పలుకుతుంది.
ఆరో తేదీన వన్ ప్లస్ 11 మార్బుల్ ఒడిస్సీ
ప్రముఖ చైనాస్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ ఈ నెల ఆరో తేదీన భారత్ మార్కెట్లోకి ‘వన్ ప్లస్ 11 మార్బుల్ ఒడిస్సీ’ని తీసుకొస్తున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది.
6.7-అంగుళాల క్యూహెచ్డీ + డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తున్నది వన్ ప్లస్ 11 మార్బుల్ ఒడిస్సీ. ఈ ఫోన్ ధర రూ.56,999 పలుకుతుందని తెలుస్తున్నది. 50-మెగా పిక్సెల్స్ + 48 మెగా పిక్సెల్స్ + 32 మెగా పిక్సెల్స్ కెమెరా కూడా లభిస్తుంది.
నెలాఖరులోగా భారత్ మార్కెట్లోకి ఒప్పో ఎఫ్23 ప్రో
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. ఈ నెలాఖరులోగా భారత్ మార్కెట్లోకి ఒప్పో ఎఫ్23 ప్రో ఫోన్ తీసుకు రానున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఒక్టాకోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 64 మెగా పిక్సెల్స్ + 8 మెగా పిక్సెల్స్ + 2 మెగా పిక్సెల్స్ కెమెరా కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్ కెమెరా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లభిస్తుంది. ఒప్పో ఎఫ్23 ప్రో ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 67 వాట్ల ఫాస్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.24,999 ఉండొచ్చునని భావిస్తున్నారు.
నెలాఖరులోనే ఐ క్యూ నియో 7 ప్రో ఆవిష్కరణ
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఐక్యూ’ ఈ నెలాఖరులోగా ‘ఐక్యూ నియో7 ప్రో’ మార్కెట్లోకి రానున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ కూడా ఉండొచ్చునని అంచనా. ఫొటోగ్రపీ కోసం 50 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా ఆప్షన్ ఉంటుంది. 6.78 అంగుళాల అమోలెడ్ ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫర్ పవర్ బ్యాకప్ ఆప్షన్‌తో వస్తున్నది. మీడియా కథనాల ప్రకారం ఈ ఫోన్ ధర రూ.38 వేల నుంచి రూ.42 వేల మధ్య ఉండొచ్చు.
త్వరలో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. త్వరలోభారత్ మార్కెట్లోకి తన వన్ ప్లస్ నార్డ్3 ఫోన్ ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల 1.5కే డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ తో వస్తున్నది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.27,999 ఉంటుందని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

