న్యూయార్క్, డిసెంబర్ 18: అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించింది.
దీంతో వడ్డీరేటు 4.5-4.75 శాతం నుంచి 4.25-4.5 శాతానికి దిగొచ్చింది. ఫిబ్రవరి 2023 తర్వాత వడ్డీరేట్లు ఇంత కనిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అలాగే ఈ ఏడాది వడ్డీరేట్లను తగ్గించడం ఇది మూడోసారి. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫెడ్ చివరి సమావేశం ఇదే కావడం విశేషం.