గురుగ్రామ్, మార్చి 20: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్..ఎస్యూవీ పరిధిని మరింత విస్తరించడానికి మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎక్స్టర్ను ఆధునీకరించి మళ్లీ విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5, 79,900గా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.9,40,900కి విక్రయించనున్నది. ఈ కారుకోసం దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద రూ.11 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని కంపెనీ సూచించింది.
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌లో లభించనున్నదని కంపెనీ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ తెలిపారు. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా వెర్షన్లో 25 అధునాతన ఫీచర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, టైప్-సీ యూఎస్బీ పోర్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్‌తో రూపొందించింది.