హైదరాబాద్, ఏప్రిల్ 15: లలితా జ్యుయెల్లర్స్.. కనీవిని ఎరుగని రీతిలో అతిపెద్ద వజ్రాభరణాల ఎగ్జిబిషన్‌కు వేదికైంది. హైదరాబాద్‌లోని సోమాజిగూడలోగల లలితా జ్యుయెల్లర్స్ షోరూంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తయారీ ధరకే వజ్రాభరణాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.
వజ్రాల హారం, గాజులు, నెక్లెస్, బ్రేస్లెట్, జుమ్కీలు, ఉంగరాలు ఆకర్షణీయమైన ఆకృతుల్లో తక్కువ ధరలకే లభిస్తాయని పేర్కొన్నది. అంతేగాక నాణ్యమైన, అరుదైన కలెక్షన్లతో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకొని క్యారెట్‌పై రూ.4,000 తగ్గింపునిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే తక్కువగా ఉన్న వీఏ చార్జీలను ఇంకా తగ్గించామని, ఇప్పుడు వీఏ రూ.999 మాత్రమేనని లలితా జ్యుయెల్లర్స్ స్పష్టం చేసింది. కస్టమర్ల కోసం బైబ్యాక్ పాలసీ కూడా ఉండగా, మరిన్ని వివరాలకు 9133323016ను సంప్రదించవచ్చు.