ముంబై, నవంబర్ 28: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) షేరు నవంబర్ 29న లిస్ట్ కానున్నాయి. ఈ మేరకు ఎక్సేంజీలు మంగళవారం సర్క్యులర్లు విడుదల చేశాయి. నవంబర్ 23న ముగిసిన ఐఆర్ఈడీఏ తొలి పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 38.80 రెట్లు అధికంగా బిడ్స్ సంపాదించింది.
ఆఫర్ ధరను రూ.32 వద్ద నిర్ణయించగా, గ్రే మార్కెట్లో పలుకుతున్న ధర ఆధారంగా 30 శాతం ప్రీమియంతో రూ.42 వద్ద లిస్ట్ కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిరుడు మే నెలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో తర్వాత మార్కెట్లోకి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఇదేకావడం గమనార్హం.