ముంబై, జనవరి 7 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లు కదంతొక్కడంతో వరుసగా రెండు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. ఐటీ రంగ షేర్లు నష్టపోయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు లాభాల్లోకి రావడానికి దోహదపడ్డాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 234.12 పాయింట్లు ఎగబాకి 78,199.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 91.85 పాయింట్లు అందుకొని 23,707.90 పాయింట్ల వద్ద స్థిరపడింది.