ముంబై, జనవరి 27: వచ్చే నెల ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. మంగళవారం విడుదల చేసిన ఓ నివేదికలో..
ద్రవ్యోల్బణం పెరిగినా ఆమోదయోగ్య స్థాయిలోనే ఉన్నందున, ఈసారి కూడా వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలనే కొనసాగించే వీలుందని చెప్పింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) చివరి ద్వైమాసిక ద్రవ్య సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ ఫిబ్రవరి 6న ప్రకటించనున్నది.