NPS | రిటైర్మెంట్తో మీకు అందే ఆదాయానికి తెరపడ్డట్టే. రోజువారీ అవసరాలకు కూడా నానా ఇబ్బందులు తలెత్తుతాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటప్పుడే ప్లానింగ్ విలువ తెలిసేది. రిటైర్మెంట్ కోసం చక్కని ప్రణాళికల్ని వేసుకొనేవారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ప్రధానమని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్వచ్చంధ పథకం విషయానికొస్తే..
రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం టైర్ 1 అకౌంట్ ప్రధానం. పూర్తిస్థాయిలో ఎన్పీఎస్, పన్ను ప్రయోజనాలను అందుకోవాలంటే ఇది అవసరం.
కనీస ప్రారంభ విరాళం రూ.500. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరం కనీస విరాళం రూ.1,000.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలదాకా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద మరో రూ.50వేలు క్లెయిం చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(2) కింద అదనపు కోతల ద్వారా కార్పొరేట్ ఉద్యోగులూ లాభం పొందవచ్చు.
టైర్ 1 ఖాతాలో ఖాతాదారునికి 60 ఏండ్లు వచ్చేదాకా లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే 60 శాతం నిధిని పన్ను లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతం నిధిని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసం యాన్యుటీని కొనాల్సి ఉంటుంది.
ఇది వాలంటరీ సేవింగ్స్ అకౌంట్. దీనికి ఎలాంటి పన్ను ప్రయోజనాలు వర్తించవు. అయితే రిటైర్మెంట్కు ముందే ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోవాలనుకొనేవారికి ఇది ఉపయోగకరం.
కనీస విరాళాలు: రూ.1,000. మీడియం టర్మ్ సేవింగ్స్, ఎమర్జన్సీలకు మంచి అవకాశం. టైర్ 2 అకౌంట్‌ను తెరవాలంటే టైర్ 1 ఖాతాను తీసుకోవాలి. కాగా, టైర్ 1, 2 ఖాతాలు సింగిల్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాణ్)కు లింకై ఉంటాయి.