న్యూఢిల్లీ, మే 4 : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్‌లైన్ కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా దాఖలు చేసుకున్న దివాలా పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది. దివాలా ప్రక్రియకు అనుమతించాలని, తాము చేయాల్సిన చెల్లింపులపై మధ్యంతర మారిటోరియం విధించాలని కోరుతూ గో ఫస్ట్ వేసిన పిటిషన్‌ను ఈ కంపెనీకి ఎయిర్‌క్రాఫ్ట్‌లు లీజుకు ఇచ్చిన సంస్థలు ఏకపక్షంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల్ని ఎన్సీఎల్టీ రిజర్వ్ చేసింది.
గో ఫస్ట్ తమ ఫ్లైట్స్‌ను మే 9వరకూ రద్దు చేస్తున్నట్టు గురువారం తెలిపింది. ఈ మేరకు పూర్తి రిఫండ్స్ ఇవ్వనున్నట్టు గో ఫస్ట్ ప్రకటించింది. తొలుత మే 3 నుంచి 5 వరకూ రద్దు చేసిన సంస్థ తాజాగా 9 వరకూ క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలిపింది.