బీవైడీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మాడల్
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా...తన తొలి హైబ్రిడ్ ‘సీల్ యూ ఎస్యూవీ’ని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్న ఈ కారును డీఎం-ఐ టెక్నాలతో తీర్చిదిద్దింది.
న్యూఢిల్లీ, జూన్ 9: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా…తన తొలి హైబ్రిడ్ ‘సీల్ యూ ఎస్యూవీ’ని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్న ఈ కారును డీఎం-ఐ టెక్నాలతో తీర్చిదిద్దింది. ఈ కారు ధర, ఇతర వివరాలు సంస్థ వెల్లడించలేదు. పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు బ్యాటరీ ప్రొవైడింగ్ సపోర్ట్‌తో నడువనున్నదని, దీంతో ఒకేసారి సింగిల్ చార్జింగ్, ఫ్యూయల్ పూర్తి ట్యాంక్‌తో 1,200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చునని బీవైడీ ఇండియా హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో సంస్థకు 14 వేల మంది కస్టమర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఈవీలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, గత నెలలో 25 వేల యూనిట్ల ఈవీ కార్లు అమ్ముడయ్యాయని, భవిష్యత్తులో రెండింతలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. డీలర్ల సంఖ్యను పెంచుదామనుకుంటున్నప్పటికీ దేశీయ కస్టమర్లు చాలా తెలివైనవారని, వారు వేచి చూసేధోరణితో ఉంటారన్నారు. అలాగే చార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఆందోళన వ్యక్తంచేసిన ఆయన..గడిచిన ఐదేండ్లకాలంలో చార్జింగ్ స్టేషన్లు భారీగా పెరిగాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

