న్యూఢిల్లీ, జూన్ 13: ఈ నెల 22న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతున్నది. 53వ సారి జరుగుతున్న ఈ సమావేశం నరేంద్ర మోదీ సర్కార్ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రధానంగా ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీ విధింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.