న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని బజాజ్..నయా చేతక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చెతక్ 3503 పేరుతో పిలిచే ఈ స్కూటర్ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. కంపెనీ విడుదల చేసిన చౌకైన స్కూటర్ ఇదే కావడం విశేషం. 3.5 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 155 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
గంటకు 63 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ స్కూటర్లో 35 లీటర్ల స్టోరేజీ ఉంటుందని పేర్కొంది. గతంలో సంస్థ విడుదల చేసిన 3501 మాడల్ కంటే ఈ నూతన మాడల్ రూ.20 వేలు తక్కువకే లభించనున్నది. కలర్ ఎల్సీడీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, 3.25 గంటల్లో బ్యాటరీ 80 శాతం రీచార్జికానున్నది.