న్యూఢిల్లీ, జూన్ 5: అంచనాలకుమించి రాణిస్తున్న దేశీయ సేవల రంగం మళ్లీ పడకేసింది. గత నెలకుగాను ఐదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పోటీతత్వం పెరగడం, ధరల ఒత్తిడితో మే నెలకుగాను హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివ్ ఇండెక్స్ 60.2కి తగ్గింది. అంతక్రితం నెలలో ఇది 60.8గా ఉన్నది. డిసెంబర్ తర్వాత ఇంతటి కనిష్ఠ స్థాయిలో గణాంకాలు నమోదుకావడం ఇదే తొలిసారి. మరోవైపు, నూతన బిజినెస్ ఆర్డర్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా దేశాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. మరోవైపు, హెచ్ఎస్బీసీ ఇండియా కంపొజిట్ ఔట్పుట్ ఇండెక్స్ 61.5 నుంచి 60.5కి దిగొచ్చింది.