Rupee | ముంబై, జూలై 18: దేశీయ కరెన్సీ రికార్డు స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్-రుఫీ ఎక్సేంజ్ రేటు 5 పైసలు కరిగిపోయి 83.63 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్‌కు అనూహ్యంగా మద్దతు లభించింది. దీంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు.
83.57 వద్ద ప్రారంభమైన డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడేలో 83.55 గరిష్ఠ స్థాయిని తాకింది. ఒక దశలో 83.66 చారిత్రక కనిష్ఠ స్థాయిని తాకిన విలువ చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే ఐదు పైసలు తరిగిపోయి 83.57 వద్ద స్థిరపడింది.