హైదరాబాద్, ఏప్రిల్ 15: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ.760 తగ్గిన తులం బంగారం ధర రూ.61,190కి పడిపోయింది.
అంతకుముందు రికార్డు స్థాయి రూ.61,950 స్థాయిలో ఉన్నది. రూ.1,100 తగ్గిన కిలో వెండి రూ.79,600 నుంచి రూ.78,500కి తగ్గింది. అలాగే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.760 దిగొచ్చి రూ.61,040గా నమోదైంది. 22 క్యారెట్ల తులం ధర రూ.700 తగ్గి రూ.55,950 వద్ద ముగిసింది. వెండి రూ.83 వేల నుంచి రూ.81,500లకు దిగొచ్చింది.