న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కియాకు చెందిన మధ్యస్తాయి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన సెల్టోస్ 4,358 యూనిట్ల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి 28 నుంచి జూలై 13 లోగా తయారైన పెట్రోల్ సెల్టోస్‌లో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌ను మార్చేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ లోపం ఉన్న మాడళ్లలో ఉచితంగానే రీప్లేస్ చేస్తామని, ఇప్పటికే కారు యాజమానులకు సమాచారం ఇచ్చింది.