న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈసారి భారీ స్థాయిలో నిధులను నెట్వర్క్ పరిధిని విస్తరించుకోవడానికి రూ.47 వేల కోట్ల నిధులను కేటాయించనున్నట్టు టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు.
గడిచిన ఏడాదికాలంలో 4జీ మౌలిక సదుపాయాలను కల్పించడానికి రూ. 25 వేల కోట్ల పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.