న్యూఢిల్లీ, జూన్ 15: ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు విడుతల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుత బాండ్ల కోసం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19-23 మధ్య ఉంటుంది. అలాగే రెండో విడుత సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 11-15 తేదీల్లో జరుగనున్నది. తొలి విడుత బాండ్లను ఈ నెల 27న, రెండో విడుత బాండ్లను సెప్టెంబర్ 20న జారీ చేస్తారు.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీసులు ఎస్జీబీలను విక్రయిస్తాయని ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్ ద్వారా సబ్‌స్రైబ్ చేసుకున్నా, ఇతర డిజిటల్ పద్ధతుల్లో చెల్లించినా బాండ్ ఇష్యూ ధరలో గ్రాముకు రూ.50 చొప్పున తగ్గింపు లభిస్తుంది.