HomeBusinessThe Central Board Of Direct Taxes Cbdt Announced The Provisions Of The Income Tax Act 2025
హైదరాబాద్ ఉద్యోగులకూ.. 50% హెచ్ఆర్ఏ మినహాయింపు
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం ఆదాయ పన్ను చట్టం-2025 నిబంధనలను ప్రకటించింది. ఇవి వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేసింది. కొత్త రూల్స్ ప్రకారం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) మినహాయింపును తమ వేతనంలో 50 శాతం వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ నిబంధనలు
నోటిఫై చేసిన సీబీడీటీ
న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం ఆదాయ పన్ను చట్టం-2025 నిబంధనలను ప్రకటించింది. ఇవి వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేసింది. కొత్త రూల్స్ ప్రకారం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) మినహాయింపును తమ వేతనంలో 50 శాతం వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను సీబీడీటీ విడుదల చేసింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని వేతన జీవులకే ఈ అవకాశం ఉన్నది. అయితే ఇంటి యజమాని, అద్దెకున్నవారి సంబంధాలను తెలియజేయడాన్ని ఇప్పుడు తప్పనిసరి చేశారు.
ఇక మిగతా ప్రాంతాల్లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏ మినహాయింపు జీతంలో యథాతథంగానే 40 శాతంగా ఉండనున్నది. కాగా, 6 దశాబ్దాల కిందటి పాత ఆదాయ పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని తెస్తూ మోదీ సర్కార్ చేసిన సవరణకు గత ఏడాది పార్లమెంట్లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టంలో సెక్షన్లు, చాప్టర్లు, పదాల సంఖ్య భారీగా తగ్గాయి. కానీ టేబుళ్లు, ఫార్ములాలు పెరిగాయి.