Tesla | న్యూఢిల్లీ, మార్చి 14: భారత్‌లో అడుగుపెట్టబోతున్న అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. ఇక్కడి మార్కెట్లో కేవలం రెండు మాడళ్లను మాత్రమే విక్రయించబోతున్నట్లు తెలుస్తున్నది. వీటిలో మాడల్ వై, మాడల్ 3 ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెటైన భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించడానికి మస్క్.. ఇక్కడే యూనిట్‌ను నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, గతేడాది దేశీయంగా లక్ష యూనిట్ల ఈ-కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం టాటామోటర్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్స్ పలు మాడళ్లను విక్రయిస్తుండగా..తాజాగా మహీంద్రా, మారుతి, హ్యుందాయ్‌లు సైతం అందుబాటులోకి తెచ్చా యి. భారత్‌లో ఈవీల వినిమయం ఊపందుకుంటున్నదని, 2023లో 6.39 శాతంగా ఉన్న మార్కెట్ వాటా ఆ తర్వాతి ఏడాదిలో 7.46 శాతానికి చేరుకున్నది.