హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఆకర్షించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఎఫ్‌డీఐలు ఆకర్షించిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచినట్టు తెలిపారు.
హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సెమినార్ హాలులో సెస్, తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ (టీఈఏ) సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు- తెలంగాణపై ప్రత్యేక దృష్టి’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎఫ్‌డీఐని ఆకర్షించడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార విధానం ఉండాలని సూచించారు.