న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. డిసెంబర్ త్రైమాసికంలో సీనియర్ ఉద్యోగుల వేరియబుల్ చెల్లింపుల్లో 20 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధించింది. ఉద్యోగి పనితీరు ఆధారంగా ఈ వేరియబుల్ చెల్లింపులు జరుపుతుంటుంది సంస్థ. వరుసగా రెండు త్రైమాసికాలుగా సిబ్బంది మెరుగైన పనితీరు కనబరిచినిప్పటికీ వేరియబుల్ చెల్లింపుల్లో కోత విధించడం విశేషం.
మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ చెల్లింపులు జరిపినట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. కానీ, కొత పెట్టిన వారిలో సీనియర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఉద్యోగులకు కార్యాలయాలకు రప్పించడంలో భాగంగా టీసీఎస్ వేరియబుల్ పే నిబంధన ల్లో గతేడాది మార్పులు చేసిన విషయం తెలిసిందే.
వేరియబుల్ పేను ఆఫీస్ హజరు తో ముడిపెట్టింది. ఎవరైతే 60 శాతం కంటే తక్కువ ఆఫీస్కు హాజరవుతారో వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టంచేసింది. 60-75 శాతం ఉన్నవారికి 50 శాతం, 75-85 శాతం ఉన్నవారికి 75 శాతం, 85 శాతం కంటే ఎక్కువ హాజరుంటేనే వేరియబుల్ అందుకునేందుకు అర్హులుగా పేర్కొంది.