ముంబై, జూలై 11: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.12,040 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11,074 కోట్ల కంటే ఇది 8.7 శాతం అధికం.
అలాగే మార్చి త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 3.1 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 5.4 శాతం ఎగబాకి రూ.62,613 కోట్లకు చేరుకున్నది. గడిచిన త్రైమాసికంలో ఉద్యోగుల వేతనాలు పెంచడంతో కంపెనీ ఆర్థిక వనరులపై ప్రభావం చూపిందని సీఎఫ్వో సమీర్ తెలిపారు.