IT Returns | ఆరోగ్య బీమా ఉంటే.. అత్యవసర సమయాల్లో దవాఖాన ఖర్చులు, వైద్య చికిత్స వ్యయాల నుంచి గొప్ప రక్షణను పొందవచ్చు. అయితే ఈ బీమా ఖరీదెక్కడంతో చాలామందికి ప్రీమియంలు భారంగా మారుతున్నాయి. దీంతో సమగ్ర ఆరోగ్య బీమా అందరికీ దక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని అధిగమించేలా ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపులను కల్పించారు.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టం (1961)లోని సెక్షన్ 80డీ కింద పాలసీదారులు ప్రతీ ఆర్థిక సంవత్సరంలో తమ ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంలపై ట్యాక్స్ రిబేటును కోరవచ్చు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ సదుపాయాన్ని ట్యాక్స్పేయర్స్ ఉపయోగించుకోవచ్చు.