అమీర్పేట, సెప్టెంబర్ 9 : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాగితం తయారీ, వినియోగాన్ని మూడు శ్లాబులుగా వర్గీకరించడం, కాగితంపై 18% పన్ను విధించడం సరికాదని, దీని వల్ల మొత్తం కాగిత పరిశ్రమే కుదుపులకు లోనవుతున్నదని తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధ్వజమెత్తారు.
ఆ సంఘం అధ్యక్షుడు అభిషేక్ విజయ్ వర్గీయ, కార్యదర్శి ఆశిష్జైన్ భన్సాలితోపాటు ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నిర్మల్ కుహాద్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థుల పుస్తకాల తయారీకి ఉపయోగించే ముడిసరుకుతోపాటు పాఠ్యపుస్తకాలపై 18% జీఎస్టీ విధించడం అనాలోచితమని మండిపడ్డారు.