న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ప్యాసింజర్ వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను సరాసరిగా 0.7 శాతం సవరిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం సంస్థ పంచ్, నెక్సాన్, హారియర్ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.