Tata Tigor.ev | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కారు టాటా టియాగో.ఈవీ కీలక మైలురాయిని దాటేసింది. భారత్ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి 50 వేల కార్లు విక్రయించిన మైలురాయిని చేరుకున్నది. టాటా టియాగో.ఈవీ కారును 2022లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది టాటా మోటార్స్. దేశంలోనే అతి తక్కువ ధరకు లభిస్తున్న కారుగా టాటా టియాగో.ఈవీ నిలుస్తుంది. దేశంలోనే అతి తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కార్లలో ఇదొకటి.
టాటా మోటార్స్ ఐదు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. టియాగో.ఈవీ తోపాటు టాటా మోటార్స్.. టాటానెక్సాన్ ఈవీ, టాటా టైగోర్ ఈవీ, టాటా పంచ్.ఈవీ, టాటా కర్వ్.ఈవీ కార్లను విక్రయిస్తోంది. టాటా టియాగో.ఈవీ నాలుగు ట్రిమ్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎక్స్ఈ, ఎక్స్ టీ, ఎక్స్ జడ్ +, ఎక్స్ జడ్ +లక్స్ వేరియంట్లలో టాటా టైగోర్.ఈవీ అందుబాటులో ఉంది. ఐదు రంగుల్లో టాటా టియాగో.ఈవీ లభిస్తుంది.
టాటా టియాగో.ఈవీ కారు టీల్ బ్లూ, డయ్ టోనా గ్రే, ట్రోపికల్ మిస్ట్, ప్రిస్టిన్ వైట్,మిడ్ నైట్ ప్లమ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 19.2కిలోవాట్లు లేదా 24 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్లతో టాటా టైగోర్.ఈవీ ఇంజిన్ అనుసంధానమై ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో 315 కి.మీ దూరం ప్రయాణించడం టాటా టైగోర్.ఈవీ కారు స్పెషాల్టీ. ఈ కారు ధర రూ.12.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలై రూ.13.75 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.