న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా డిసెంబర్ ఈఎంఐ స్కీంను పరిచయం చేసింది. కంపెనీకి చెందిన పది మాడళ్లపై తక్కువ ఈఎంఐకే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కస్టమర్లకు కల్పించింది. దీంట్లో టియాగోను రూ.4,999 ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. పెట్రోల్ మాడళ్లతోపాటు ఎలక్ట్రిక్ మాడళ్లపై కూడా ప్రత్యేక ఈఎంఐ ఆఫర్‌తో అందిస్తున్నది.
ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. టియాగోపై రూ.4,999 ఈఎంఐ ఆఫర్ ఇచ్చిన సంస్థ..గరిష్ఠంగా కర్వ్య్ ఈవీ మాడల్‌పై రూ.14,555 ఈఎంఐ ఆప్షన్ ఇచ్చింది. వీటితోపాటు నెక్సాన్, పంచ్, అల్ట్రోజ్తోపాటు మరిన్ని మాడళ్లపై తక్కువ ఈఎంఐకే అందిస్తున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహనాలపై తీసుకున్న రుణాన్ని 84 నెలల్లో, ఈవీలపై 120 నెలల్లో తిరిగి చెల్లింపులు జరుపాల్సివుంటుంది.
