Tata Punch | గతంతో పోలిస్తే కార్ల తయారీ సంస్థల్లో పోటీ తత్వం పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఎస్యూవీ కార్లపై మోజు పెంచేసుకోవడంతో ఆటోమొబైల్ సంస్థలన్నీ ఆ సెగ్మెంట్ కార్ల తయారీపైనే దృష్టిని కేంద్రీకరించాయి. ఇటీవలి కాలం వరకూ ప్రతి సెగ్మెంట్ లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన మారుతి సుజుకికి సవాల్ ఎదురవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మైక్రో ఎస్ యూవీ మోడల్ కారు టాటా పంచ్.. మారుతి సుజుకి స్విఫ్ట్ ను దాటేసింది. గత నెలలో మూడు శాతం సేల్స్ పుంజుకుని మొత్తం 3.7 లక్షల కార్లు అమ్ముడైతే టాప్-5లో టాటా పంచ్ (Tata Punch), మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift), హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuku Ertiga) నిలిచాయి.
గత మే నెలలోనూ టాప్-10లో టాప్ సెల్లింగ్ కారుగా నిలిచిన టాటా పంచ్.. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) కారును జూన్ నెలలో క్రాస్ చేసింది. కొన్ని నెలలుగా నిరంతరం బెస్ట్ సెల్లింగ్ కార్లలో టాటా పంచ్ నిలుస్తోంది. తక్కువ ధరతోపాటు అడ్వాన్స్డ్ ఫీచర్లతో కస్టమర్లకు ఆకట్టుకుంటోంది టాటా పంచ్. అంతే కాదు భారత్ ఎన్-క్యాప్5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా కలిగి ఉంది. గత నెలలో టాటా పంచ్ 18,238 యూనిట్లు విక్రయించింది.
ఇక టాప్ బెస్టింగ్ 10 కార్లలో ఆరు మోడల్ కార్లూ మారుతి సుజుకివే. తద్వారా దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తోంది మారుతి సుజుకి. 2024 మే నెలలో 16,422 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచిన మారుతి స్విఫ్ట్ గత నెలలో 16 శాతం విక్రయాలు తగ్గడంతో 16,422 యూనిట్లకు దిగి వచ్చింది. హ్యుండాయ్ క్రెటా 16,293 కార్లతో మూడో స్థానంలో (నెలవారీగా 12 శాతం గ్రోత్) నిలిచింది. మారుతి ఎర్టిగా రికార్డు స్థాయిలో 15 శాతం సేల్స్ పెంచుకుని గత నెలలో 15,902 యూనిట్లు విక్రయించింది.
మారుతి బాలెనో ఐదో స్థానం, మారుతి న్యూ వ్యాగన్ ఆర్ ఆరో స్థానం, మారుతి డిజైర్, ఏడవ, విటారా బ్రెజా ఎనిమిదో స్థానాన్ని పొందాయి. ఇక మహీంద్రా స్కార్పియో కారు టాప్ -10 లిస్టులో తొమ్మిదో స్థానానికి పరిమితం కాగా, టాటా నెక్సాన్ 12,066 యూనిట్ల విక్రయాలతో టాప్ 10 స్థానానికి చేరుకున్నది.
టాటా పంచ్ – 18,238
మారుతి సుజుకి స్విఫ్ట్ – 16,422
హ్యుండాయ్ క్రెటా – 16,293
మారుతి సుజుకి ఎర్టిగా – 15,902
మారుతి బాలెనో – 14,895
మారుతి వ్యాగన్ ఆర్- 13,790
మారుతి డిజైర్ – 13,421
మారుతి బ్రెజా – 13,172
మహీంద్రా స్కార్పియో – 12,307
టాటా నెక్సాన్ – 12,066
Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Suzuki Motor Cycles | ఫెస్టివ్ కలర్స్ తో సుజుకి యాక్సెస్.. బర్గ్మన్ స్ట్రీట్ స్కూటర్లు.. ధరలిలా..!