Tata Punch CNG | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. త్వరలో ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. టాటా పంచ్ సీఎన్జీ ఆవిష్కరిస్తే ట్విన్ సిలిండర్లతో మార్కెట్లోకి వచ్చిన తొలి మోడల్ అవుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ తన పంచ్ సీఎన్జీ వేరియంట్ ను ఆవిష్కరించింది. గతేడాది ఫిబ్రవరిలో తన కార్లను సీఎన్జీ వేరియంట్లలో ఆవిష్కరించడం ప్రారంభించింది టాటా మోటార్స్. తొలుత టాటా టియాగో సీఎన్జీ.. అటుపై టైగోర్ సీఎన్జీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవలే ట్విన్ సిలిండర్స్ కెపాసిటీతో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ఆల్ట్రోజ్ తర్వాత మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ పరిధిలో .. ఇటీవల హ్యుండాయ్ ఆవిష్కరించిన ఎక్స్టర్తో తల పడుతుంది టాటా పంచ్ సీఎన్జీ.
టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ ట్విన్ సిలిండర్ టాంక్ (ఒక్కో సిలిండర్ 30 లీటర్ల సామర్థ్యం). ఈ కారు బూట్ స్పేస్ కెపాసిటీ యథాతథంగా కొనసాగుతుంది. అయితే పెట్రోల్ వేరియంట్లో మాత్రం 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఆల్ట్రోజ్‌లో మాదిరిగా టాటా పంచ్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 84 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ 76 బీహెచ్పీ విద్యుత్, 97 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. పెట్రోల్ వేరియంట్లో 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉంటది. ఆల్ట్రోజ్ అండ్ పంచ్ సీఎన్జీ వేరియంట్ కార్లు కిలో సీఎన్జీ గ్యాస్ మీద 26 లేదా 27 కి.మీ మైలేజీ ఇస్తాయి.
టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ కారు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ ఏసీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, 7-అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7-అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పెట్రోల్ వేరియంట్లో మాదిరిగానే పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ ఆప్షన్ కూడా ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెథర్ అప్ హోల్స్టరీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆర్ 16 డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ అంటీనా, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎం తదితర ఫీచర్లు ఉంటాయి.
పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే టాటా పంచ్ సీఎన్జీ కారు ధర రూ.లక్ష కంటే ఎక్కువ ధర పలుకొచ్చు. పెట్రోల్ వేరియంట్ టాటా పంచ్ ధర రూ.6 లక్షల నుంచి మొదలు రూ.9.54 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు పలుకుతుంది.