Nexon EV Max Dark | దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ అత్యంత పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ న్యూ డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Max Dark Edition)ను మార్కెట్లో ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీ ప్రైమ్ ఆల్ బ్లాక్ ఆప్షన్ కారు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో కూడా ఇదే కలర్ ఆప్షన్ కారు తీసుకొచ్చింది.
టాటా న్యూ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Max Dark Edition) కారు రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ కారు ధర రూ.19.04 లక్షల నుంచి మొదలవుతుంది. ఎక్స్‌జడ్ లక్స్ వేరియంట్ రూ.19.04 లక్షలు పలుకుతుంది. ఎక్స్‌జడ్+ లక్స్ విత్ 7.2 కిలోవాట్స్ ఏసీ ఫాస్ట్ చార్జర్ ధర రూ.19.54 లక్షలుగా నిర్ణయించారు.
టాటా న్యూ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Max Dark Edition)లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. రేర్ వ్యూ కెమెరా, హెచ్డీ డిస్ప్లే, ఆరు ప్రాంతీయ భాషల్లో వాయిస్ అసిస్టెంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కారు ప్లే, న్యూ యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ), కంట్రోల్ నాబ్, డార్క్ థీమ్డ్ లెథరెట్టే డోర్ ట్రిమ్స్, సీట్ అప్హోల్స్టరీ విత్ ఈవీ బ్లూ హైలైట్ స్టిచెస్, గ్లాసీ పియానో బ్లాక్ డాష్ బోర్డ్ విత్ ట్రై యారో ప్యాటర్న్, లెదర్ రాప్డ్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
టాటా న్యూ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Max Dark Edition)లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఫ్రంట్ లెథరెట్టే వెంటిలేటెడ్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫయర్ విత్ ఏక్యూఐ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రేర్ ఏసీ వెంట్స్, స్మార్ట్ కీ విత్ ఫుష్ బటన్ స్టార్ట్/ స్టాప్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్వీఎంస్ విత్ ఆటో ఫోల్డ్, రేర్ వైఫర్ వాషర్, డీఫాగర్, 7.0-అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ ఫుల్లీ గ్రాఫిక్ డిస్ప్లే తదితర ఫీచర్లు జత చేశారు.
టాటా న్యూ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Max Dark Edition) కారు శక్తిమంతమైన 40.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నెక్సాన్ ఈవీ ప్రైమ్ వేరియంట్‌తో పోలిస్తే డార్క్ ఎడిషన్ బ్యాటరీ కెపాసిటీ 33 శాతం ఎక్కువ. సింగిల్ చార్జింగ్‌తో 437 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. మిడ్నైట్ బ్లాక్ కలర్ విత్ చార్కోల్ గ్రే కలర్డ్ అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ట్రై-యారో డీఆర్ఎల్స్, ట్రై-యారో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, శాటిన్ బ్లాక్ హ్యుమానిటీ లైన్, షార్క్ ఫిన్ ఆంటీనా, రూఫ్ రెయిల్స్, ఫెండర్‌పై డార్క్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
7.2 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 56 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ టాటా న్యూ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Max Dark Edition) కారు స్పెషాలిటీ. రెగ్యులర్ టైంలో పూర్తిస్థాయిలో చార్జింగ్ కావడానికి 6.5 గంటలు పడుతుంది. కమర్షియల్‌గా వాడే 50కిలోవాట్ల డీసీ చార్జర్‌తో కేవలం 56 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఈ కారు ఇంజిన్ 143 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. తొమ్మిది సెకన్లలో 100 కి.మీ. వేగం అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో ప్రయాణించగలుగుతుంది. స్వల్పకాలంలోనే 50 వేలకు పైగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కార్లు అమ్ముడు కావడం ఆసక్తికర పరిణామం.