Tata Motors | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయి వృద్ధిరేటు నమోదు చేసుకుంది. 2023-24తో పోలిస్తే 2024-25 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 74శాతం వృద్ధిరేటుతో రూ.5,566 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం గడించింది. మార్కెట్ వర్గాల అంచనాలను టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలు బ్రేక్ చేశాయి.
టాటా మోటార్స్ (Tata Motors) ఏప్రిల్ త్రైమాసికంలో రూ.1.08 లక్షల కోట్ల ఆదాయం సంపాదించింది. గతేడాదితో పోలిస్తే ఆరు శాతం ఎక్కువ. ఈబీఐటీ ఆదాయం రూ.9100 కోట్లుగా ఉంది. ఈబీఐటీ మార్జిన్ 8.4శాతం పుంజుకుంది. వార్షిక ప్రాతిపదికన 30 బేసిక్ పాయింట్లు పెరిగింది. వాణిజ్య వాహనాల (సీవీ) ఆదాయం గతేడాదితో పోలిస్తే ఐదు శాతం పెరిగి రూ.17,800 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాణిజ్య వాహనాల విభాగం హోల్ సేల్ విక్రయాలు ఆరు శాతం పెరిగి 93,700 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయంగా మాత్రం 6.7 శాతం గ్రోత్ నమోదైతే, విదేశాలకు ఎగుమతులు ఫ్లాట్ గా కొనసాగాయి.
Nothing Phone 2a Plus | నథింగ్ మిడ్ రేంజ్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold Rates | బంగారం ధర మళ్లీ పైపైకి.. అందరి కళ్లూ అటువైపే..!
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
JioBharat J1 4G | మార్కెట్లోకి జియో మరో బడ్జెట్ ఫీచర్ ఫోన్ జియోభారత్ జే1 4జీ.. రూ.1,799లకే లభ్యం..!