Tata Motors – Bajaj Finance | టాటా మోటార్స్ అనుబంధ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం).. బజాజ్ ఫైనాన్స్ సంస్థతో జత కట్టాయి. కార్లు, ఈవీ కార్ల డీలర్ల ఫైనాన్సింగ్ బలోపేతానికి అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశవ్యాప్తంగా టీఎంపీవీ, టీపీఈఎం డీలర్లకు కొల్లెటరల్ పత్రాలతో రుణ పరపతి కల్పిస్తాయని టీపీఈఎం సీఎఫ్ఓ – టీఎంపీవీ డైరెక్టర్ ధిమాన్ గుప్తా చెప్పారు. దీనివల్ల తమ డీలర్ల వర్కింగ్ క్యాపిటల్ మెరుగు పడుతుందన్నారు.
బజాజ్ ఫైనాన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ సాహా మాట్లాడుతూ ‘కార్ల మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో టీఎంపీవీ, టీపీఈఎం డీలర్లకు ఆర్థిక వసతుల కల్పనకు, ఆటోమోటివ్ ఇండస్ట్రీ బలోపేతానికి తమ భాగస్వామ్యం ఉపకరిస్తుంది’ అని అన్నారు.