న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్యాసింజర్ వాహన ధరలను పెంచిన టాటా మోటర్స్ తాజాగా కమర్షియల్ వాహన ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ పెంపు అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం అధికమవడం వల్లనే కమర్షియల్ వాహన ధరలను పెంచాల్సి వస్తున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆయా మోడళ్లను బట్టి ధరల పెంపు ఆధారపడివుంటుందని పేర్కొంది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను తక్కువ మొత్తంలో పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది.