Tata Motors EV Cars | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ గత నెల విద్యుత్ కార్ల సేల్స్‌లో 66 శాతం గ్రోత్ నమోదైంది. 2022 మే నెలలో 3,505 ఈవీ కార్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది 5,805 యూనిట్లు సేల్ అయ్యాయి. కానీ, గత నెలలో వాహనాల విక్రయంలో టాటా మోటార్స్ వెనుక పడింది. 2022 మే నెలలో 74,755 వాహనాలు అమ్ముడు కాగా, గత నెలలో 73,448 యూనిట్లతో సరిపెట్టుకున్నది. 2022 మే నెలలో 43,392 కార్లు అమ్ముడైతే, గత నెలలో 45,984 కార్లు సేల్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఆరు శాతం సేల్స్ పెరిగాయి.
భారీ వాహనాల విక్రయంలో 11 శాతం గ్రోత్ నమోదైంది. 2022 మే నెలలో 7343 భారీ వాహనాలు అమ్ముడు కాగా, గత నెలలో 8,160 వెహికల్స్ అమ్ముడయ్యాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం తెలిపింది. ఇంటర్మీడియట్ లైట్ మీడియం కమర్షియల్ సేల్స్ విభాగంలో టాటా మోటార్స్ వెనుక పడింది. 2022 మేలో 5540 వెహికల్స్ విక్రయించగా, గత నెలలో 3450 యూనిట్లు అమ్ముడయ్యాయి.