Tata Curvv | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్.. మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీకౌప్ కర్వ్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ మాడల్ రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. ఈ సందర్భంగా టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన విభాగ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ..దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్లో కర్వ్‌ను విడుదల చేసినట్లు, ప్రతియేటా ఈ సెగ్మెంట్లో ఏడు లక్షల వాహనాలు అమ్ముడుకానుండటంతో సంస్థల మధ్య పోటీ తీవ్రంగా నెలకొన్నది.
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్, హోండా ఎలివేట్లకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను ప్రవేశపెడుతున్నది. ఆరు రంగుల్లో లభించనున్న ఈ మాడల్ రూ.9.99 లక్షల నుంచి రూ.18 లక్షల లోపు లభించనున్నది. 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, అన్ని వైపుల కెమెరాలు, వైర్లెస్ చార్జర్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.