న్యూఢిల్లీ : ప్రస్తుత దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 8 శాతానికి పెరిగితే 2047 నాటికి భారత్ ఆర్ధిక వ్యవస్ధ 30 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆకాంక్షించారు. దేశం వందేండ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే సమయానికి భారత జీడీపీని 25-30 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగేలా చేయడం మనందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
ఫిక్కి 95వ వార్షిక సదస్సులో టాటా బాస్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ గత దశాబ్ధంలో భారత పురోగతి అద్భుతంగా సాగిందని అన్నారు. ఈ సమయంలో దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ నుంచి ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిందని గుర్తుచేశారు. ఆర్ధిక మాంద్య ఒత్తిళ్లు, అధిక ద్రవ్యోల్బణం, అప్పుల ఊబి, ప్రజల ఆదాయం పడిపోవడం వంటి సమస్యలు
రాబోయే దశాబ్ధాల్లో దేశం మెరుగైన సామర్ధ్యం కనబరిచే క్రమంలో సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత మెరుగైన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.