న్యూఢిల్లీ, ఆగస్టు 5 : బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ టాటా క్యాపిటల్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమవుతున్నది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద రూ.17,200 కోట్ల మెగా ఐపీవో కోసం అప్డేట్ చేసిన డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. వీటి ప్రకారం మొత్తం 47.58 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు.
ఇందులో 21 కోట్ల ఈక్విటీ షేర్లు ఫ్రెష్ ఇష్యూగా, 26.58 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)గా రానున్నాయి. కాగా, ఓఎఫ్ఎస్లో టాటా సన్స్ ద్వారానే 23 కోట్ల షేర్లు సేల్కు వస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) 3.58 కోట్ల షేర్లను అమ్మేయనున్నది.