ముంబై, జూన్ 7: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగాన్ని మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్.. మార్కెట్లోకి నయా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అల్ట్రోజ్ రేసర్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ మూడు రకాల్లో లభించనున్నది.
1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందించిన ఈ మాడల్‌లో 26 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ డీసీఏ, డీజిల్, సీఎన్జీల్లో లభించనున్నది. వీటిలో ఆర్1 మాడల్ ధర రూ.9.49 లక్షలు, ఆర్ 2 ధర రూ.10.49 లక్షలు, ఆర్3 ధర రూ.10.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అల్ట్రోజ్కు 2.5 లక్షల కస్టమర్లు ఉన్నారు.